కాంగ్రెసులో చేరిన కౌన్సిలర్లు సమాధానం చెప్పాలి: చిన్నయ్య
నేటి ప్రజా తెలంగాణ బెల్లంపల్లి నాతోటి ఉన్న కౌన్సిలర్లు అందరూ అన్ని పనులు చేయించుకొని బీఆర్ఎస్ ని వీడి కట్ట కట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారని, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆగ్రహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ. కౌన్సిలర్లు అందరూ కాంగ్రెస్ లో ఎందుకు చేరారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సింగరేణి, ప్రభుత్వ స్థలాల్లో నివాసమున్న పేదలకు కెసిఆర్ఆశీర్వాదంతో పట్టాలు ఇప్పించానన్నారు. బెల్లంపల్లిలో ప్రతినిత్యం ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ, ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందిస్తూ ఎమ్మెల్యే క్వార్టర్లో 24 గంటలు అందుబాటులో ఉండే నేను మీకు అన్ని విధాలుగా సహాయసఫలాలు అందించాను, నేను మీ బిడ్డని నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటా మీకు సేవ చేస్తూ అధికారం ఉన్న లేకున్నా నేను మీలోపరిగా ఉంటానని వారు అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కొప్పుల ఈశ్వర్ కు మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.