*గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి*
నేటి ప్రజా తెలంగాణ: మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రం లో గల పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి పంజాల సతీష్ (43) ఉదయం వ్యాయామం లో భాగంగా స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించినట్లు అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ గతంలో పోలీస్ డ్యూటీ లో నూతనంగా విధులు నిర్వహిస్తున్న సమయం నుండి ఇప్పటివరకు సతీష్ ఒక రీమార్క్ లేకుండా ఎంతో నిజాయితీగా,చాకచక్యంగా విధులు నిర్వహించారని తోటి కానిస్టేబుల్ లతో స్నేహపూర్వకంగా మేదిలేవాడని,ఉన్నత అధికారులతో ఎప్పుడూ మర్యాదగా నడుచుకునేవాడని, అతి చిన్న వయసులో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేశారు.మృతుడు సతీష్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.వారి ఆత్మ శాంతించాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు,తోటి పోలీస్ మిత్రులు,అధికారులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.