Praja Telangana
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ అభ్యర్థి కావ్య

మడికొండ ఎన్ ఆర్ ఎన్ గార్డెన్స్ లో నిర్వహించిన వర్దన్నపేట నియోజకవర్గం కాజీపేట మండల బూత్ కమిటీ మరియు మండల విస్తృత స్థాయి సమావేశంలో వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు డీసిసి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.
*డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ
డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కృషి చెస్తా.
డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అని అన్నారు
వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటుతో పాటు ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తా.విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో వరంగల్ నగరాన్ని ఏడ్యూకేషన్ హాబ్ గా, ఐటి హాబ్ గా, ఇండస్ట్రీయల్ హాబ్ గా తీర్చిదిద్దుతా.
మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తే హైదరాబాద్ కు దీటుగా వరంగల్ నగర అభివృద్ధికి పాటు పడుతా.
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఉంది.
బీజేపీ నుండి దేశానికి విముక్తి కల్పించాలంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతోనే సాధ్యం అవుతుంది.
రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే మనం ఇంత స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం.
అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలనీ చూస్తున్న బీజేపీనీ తరిమికొట్టాలి.
ఇన్నిరోజులు జరిగింది ఒక ఎత్తు… రానున్న వారం రోజులు జరిగేది మరో ఎత్తు
బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ భూ కబ్జాలు మీ తెలియనివి కావు
అసెంబ్లీ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి చెంప చేల్లు మనిపించారు ఇప్పుడు వేసే ఓటుతో గూబ గుయ్యిమనాలి.
మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించాలి
మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
ఈ కార్యక్రమంలో డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, దొమ్మటి సాంబయ్య, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి*

వకీల్ సాబ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

నాణ్యతా ప్రామాణాలతో నూతనంగా మంజూరైన మినీ క్రికెట్ ఇండోర్ స్టేడియం పూర్తి చేస్తాం ఎమ్మెల్యే జారె*

Share via