Praja Telangana
తెలంగాణ

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి.

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలి

బెల్లంపల్లి ఎ.సి.పి ఏ రవికుమార్ ఆధ్వర్యంలో
బెల్లంపల్లి
రామగుండం పోలీస్ కమిషనర్, ఎం శ్రీనివాసులు, ఐజి ఉత్తర్వుల మేరకు, మంచిర్యాల జిల్లా డిసిపి శ్రీ అశోక్, మరియు బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసీపి రవికుమార్ ఆదేశాల మేరకు, బెల్లంపల్లి ఏ .సి.పి ఆధ్వర్యంలో,బెల్లంపల్లి టౌన్ పరిధిలో శుక్ర వారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ప్రజలందరూ తమ ఓటు హక్కుని నిర్భయంగా సద్వినియోగం చేసుకునే విధంగా బెల్లంపల్లి పట్టణంలో పోలీస్ సిబ్బంది మరియు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎ .సి.పి మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు పోలీసు వారి నియమ నిబంధన సూచనలు పాటిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు, తమ ఓటు హక్కు ను వినియోగించుకుని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ రాకేష్ మిశ్రా,బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, బెల్లంపల్లి 1 టౌన్ ఎస్సై రమేష్, బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ డి.రమేష్, తాల్లగురిజాల ఎస్ఐ నరేష్ లతో , పాటు 50 మంది కేంద్ర బలగాలు బి ఎస్ ఎఫ్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆదరించు సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

బెదిరింపు చర్యల కు పాల్పడితే సహించేది లేదు

ఈ రోజు హైద్రాబాద్ లో *సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు,ప్రస్తుత రాష్ట్ర టీ,పి,సి,సి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారిని* మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. *అనంతరం బీసీ కులస్థుల సమస్యలకోసం చర్చించడం జరిగింది* *వెంకట్ యాదవ్ యూత్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి*

Share via