బెల్లంపల్లిలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అక్క పాక తిరుపతి. బెల్లంపల్లి బెల్లంపల్లిలో శుక్రవారం టిడిపి కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన పెద్దపల్లి స్వతంత్ర ఎంపీ అభ్యర్థి అక్కపాక తిరుపతి ఆయన మాట్లాడుతూ టిడిపి హయాంలో 25 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ వచ్చానని, ఈ ప్రాంతంలో ప్రజలకు రాజకీయం అంటే ఏంటిదో ప్రజలకు తెలియజేసింది స్వర్గీయ తారక రామారావు చంద్రబాబు నాయుడు అని, తెలుగుదేశం చేసిన పనులు ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేదని ఈ ప్రాంత అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ, ఎంతో సేవ చేసిందని, కార్మికులకు అన్ని హక్కులు కల్పించింది, ఒక్క తెలుగుదేశం పార్టీ అని, అందుకే ఆ పార్టీలో పనిచేసిన నన్ను, పెద్దపల్లి స్వతంత్ర అభ్యర్థిగా నిలుచున్న నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ,ప్రజలను కోరుచున్నాను నన్ను, మీ అమూల్యమైన ఓటు నాకు వేసిన తెలుగుదేశం పార్టీకి వేసినట్టని ఆయన అన్నారు. నా గెలుపుకు మీరు కృషి చేస్తే నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టి మణి రామ్ సింగ్ గద్దల నారాయణ సానరత్నం టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు