Praja Telangana
తెలంగాణ

ఈ.వి.ఎం.ల భద్రత లో భాగంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు*

*ఈ.వి.ఎం.ల భద్రత లో భాగంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు*

*కౌంటింగ్ రోజు మూడు అంచెల భద్రత ఏర్పాటు: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ .*

లోక్ సభ ఎన్నికలు-2024లో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలో మే 13న జరుగనున్న పోలింగ్ కార్యక్రమం తరువాత కొరకు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచే ఈ.వి.ఎం.ల రక్షణ మరియు ఎన్నికల తరువాత కౌంటింగ్ రోజు కేంద్రం వద్ద పటిష్టమైన మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ ., (ఐజి) గారు పేర్కొనారు. రామగిరి లోని JNTU ఇంజనీరింగ్ కళాశాల లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతా, కౌంటింగ్ రూమ్స్ ఏర్పాట్లను రామగుండం కమీషనర్ అఫ్ పోలీస్ శ్రీనివాస్, పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ,జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, గోదావరిఖని ఎ.సి.పి. రమేష్ మంథని సీఐ వెంకటేశ్వర్లు లతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ…… ఎన్నికల తరువాత కౌంటింగ్ ల సెంటర్ వద్ద భద్ర పరిచే ఈ.వి.ఎం.ల స్ట్రాంగ్ రూమ్ ల భద్రత మరియు కౌంటింగ్ రోజు ల భద్రతలో భాగంగా నియోజక వర్గాల వారిగా బారికేడ్స్ ఏర్పాట్లు , సి.సి. కెమెరాలు ఏర్పాటు, అభ్యర్ధులు, ఏజెంట్స్ ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు మరియు బందోబస్తు కొరకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని సిపి గారు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు కౌంటింగ్ రోజున ఎలాంటి ఆచాంఛనీయ ఘటనలు జరుగకుండా మూడు అంచెల భద్రత బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ హాల్లు, కౌంటర్లు, విద్యుత్, ఇంటర్నెట్, త్రాగునీరు,ఫైర్ సెక్యూరిటీ ఏర్పాటు, ఇతరత్రా పూర్తి సదుపాయాలు గురించి చర్చించడం జరిగిందని సిపి గారు తెలిపారు.

Related posts

బీసీల పట్ల బీజేపీ వైఖరి మార్చుకోవాలి*

హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం..!!*

Share via