ఈనెల నాలుగవ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మంచిర్యాల మాజీ శాసనసభ్యులు శ్రీ నడిపెల్లి దివాకర్ రావు ఇంట్లో పాత్రికేయ సమావేశం నిర్వహించిన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్
ఈ సందర్భంగా బాల్క సుమన్ గారు మాట్లాడుతూ..
మే 4 వ తేదీన సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ గారు మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కి మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షో లో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజలు, కార్మికులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో కాంగ్రెస్, బీజేపీ తప్ప వేరే పార్టీలు లేకుండా చేయాలని రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒక నేషనల్ ఛానల్ లోనే మోడీకి ఓటు వేయమని చెప్పడమే దీనికి నిదర్శనం. కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు లోపాయి కారి ఒప్పందంతోనే ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా బహిరంగానే బిజెపికి ఓటు వేయమని ప్రచారం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలవాలని కాంగ్రెస్ తరపున బలహీనమైన అభ్యర్థులను బరిలోకి నిలిపారు.
కాంగ్రెస్, బిజెపి అరాచకాలు దొంగ హామీలుపై కెసిఆర్ బస్సు యాత్రలో ప్రశ్నిస్తుంటే ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయి. బస్సు యాత్రతో బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను డైవర్ట్ చేయడానికి మతం, రిజర్వేషన్లు అంటూ కొత్త డ్రామాలు తెర తీస్తున్నరు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కెసిఆర్ గారి బస్సు యాత్రను చూసి వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే దేశంలో ఏ నాయకుడిపైన లేని విధంగా 48 గంటల నిషేధం విధించారు.
రాష్ట్రంలో మంచినీరు, సాగునీటి సమస్య విద్యుత్ సమస్యలు అన్ని గాలికి వదిలేసింది రేవంత్ సర్కార్.
రెండు లక్షల ఉద్యోగాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానాల పెంపు, రైతుల ఆదాయం రెట్టింపు చేయని బిజెపికి ప్రజలు ఎవరు ఓటు వేయద్దు.
దేశ ప్రధాని తెలంగాణ పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నాడని విమర్శించినప్పటికీ రేవంత్ రెడ్డిపై ఈడీ, సిబిఐ దాడులు ఎందుకు జరగడం లేదో ప్రజలు అర్థం చేసుకోవాలి.
బడే మియా మోడీ – చోటే మియా రేవంత్ మూలాఖత్ అయి పెద్దపల్లిలో బలహీన మైనా అభ్యర్థిని బరిలో నిలిపారు.
26 సంవత్సరాలు సింగరేణి కార్మికుల తరఫున పోరాటం చేసిన కార్మిక బిడ్డ కొప్పుల ఈశ్వర్ గారిని భారీ మెజారిటీతో ఆశీర్వదించాలి.
కేసీఆర్ ది కుటుంబ పాలన అని విమర్శించిన కాంగ్రెస్ పెద్దలు ఒకే పార్లమెంటు నియోజకవర్గంలో వివేక్, వినోద్ ఇద్దరికి ఎమ్మెల్యేలు ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వివేక్ కొడుకుకు టికెట్ ఇవ్వడం కుటుంబ పాలన, రాచరిక పాలన కాదా❓
పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గం వివేక్ కుటుంబ గుత్తాధిపత్యమా?
పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో, కాంగ్రెస్ పార్టీలో వేరే దళితులు లేరా అని ప్రశ్నించారు.
దేశంలో ఎన్నో గొప్ప గొప్ప పదవులు అనుభవించిన దళిత నాయకులు, కేంద్ర మంత్రులుగా పని చేసిన ఏ దళిత నాయకులు కూడా సంపాదించని వేల కోట్లు వివేక్ కుటుంబ సభ్యులు ఎలా సంపాదించారో ప్రజలు అర్థం చేసుకోవాలి.
రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని వివేక్ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు లాభపడ్డారో వారికి వారే ఆత్మ విమర్శ చేసుకోవాలి.
దశాబ్దాలుగా కాకా కుటుంబ సభ్యులు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఏ దళిత నాయకుడు ఎదగకుండా సొంత మీడియాలో అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ఎదగకుండా కుట్రలు చేశారు. అన్నారు
previous post