చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో కార్మిక సంఘం ముఖ్య నాయకులు, మందమర్రి పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ . పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా పట్టణంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం మరియు ఈనెల 4 వ తేదీన మంచిర్యాల ఐబి చౌరస్తాలో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో విజయవంతం కొరకు నాయకులతో సమీక్షించారు.