Praja Telangana
తెలంగాణ

చట్ట వ్యతిరేకమైన నేరాలపై ఉక్కుపాదం…

*చట్ట వ్యతిరేకమైన నేరాలపై ఉక్కుపాదం…*

*పీడి యాక్ట్ అమలకు జాబితా సిద్ధం..*

*చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడేవారు వారి నేర ప్రవృత్తి మార్చుకోవాలి : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,*

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతూ నేరాల నియంత్రణకై పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని ముఖ్యంగా రామగుండం కమిషనర్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, పిడిఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణా, నకిలీ విత్తనాల అక్రమ రవాణా, పేకాట, కోడి పందాలు ఆడేవారిపై, గుడుంబా తయారీ, అక్రమ రవాణా, ఇల్లీగల్ ఫైనాన్స్, అనుమతి లేని చిట్ ఫండ్స్, భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, అనుమతి లేని లే అవుట్ వెంచర్స్ నిర్మాణం, ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టి పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు కఠినంగా వ్యవహరిస్తూ ఎంతటి వారైనా ఉపేక్షించకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు పాల్పడుతూ ప్రజలకు నష్టం జరిగే పనులు చేసే వారికి చట్ట పరిధిలో శిక్ష తప్పదని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) గారు ఒక ప్రకటన లో తెలిపారు.

*పిడి యాక్ట్ అమలకు రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే కొంతమంది వ్యక్తుల జాబితా సిద్ధం చేశాం అని సిపి గారు తెలిపారు.*

*ఫిబ్రవరి 14 నుండి ఈరోజు వరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో నమోదైన కేసుల వివరాలు…*

*గంజాయి కేసులు..*

📌16 కేసులు 42 మందిపై నమోదు చేయడం జరిగింది.13.228 కిలోల గంజాయి,14 గంజాయి మొక్కలు స్వాధీనం. వాటి విలువ 4,65,700/- రూపాయలు.

*పిడిఎస్ రైస్ కేసులు..*

📌48 కేసులు 70 మందిపై నమోదు చేయడం జరిగింది.96,905 కిలోల పిడిఎస్ రైస్(969.05 క్వింటాల్ ) స్వాధీనం. వాటి విలువ 17,94,090/- రూపాయలు.

*ఫైనాన్స్ కేసులు*

📌23 కేసులు 24 మందిపై నమోదు చేయడం జరిగింది.

📌 *ప్రధాన మంత్రి కౌశల్య కేంద్ర్ స్కీం (PMKK) కేంద్ర ప్రభుత్వ పథకం నకు సంబందించి ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా అవకతవకలకు పాల్పడిన అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటడ్ సంస్థ నిర్వాహకులు అరెస్ట్*

*ID లిక్కర్ కేసులు*

📌105 కేసులు 105 మందిపై నమోదు చేయడం జరిగింది. 513 లీటర్లు స్వాధీనం. వాటి విలువ 2,01,720/- రూపాయలు.

*IMFL లిక్కర్ కేసులు*

📌178 కేసులు 181 మందిపై నమోదు చేయడం జరిగింది. 1449 లీటర్లు స్వాధీనం. వాటి విలువ 8,34,649/- రూపాయలు.

*పేకాట కేసులు*

📌27 కేసులు 184 మందిపై నమోదు చేయడం జరిగింది. 22,15,260/- రూపాయలు సిజ్ చేయడం జరిగింది.

*ఇసుక అక్రమ రవాణా కేసులు*

📌40 కేసులు 87 మందిపై నమోదు చేయడం జరిగింది. 438400/- రూపాయలు విలువ గల ఇసుక ,ట్రాక్టర్స్ -50,డిసిఎం వ్యాన్ -01 ,JCBలు -03 సిజ్ చేయడం జరిగింది.

*మంథని ముత్తారం ఖమ్మం పల్లి గ్రామ శివారులో 60 ట్రాక్టర్ ల అక్రమంగా నిలవ ఉంచిన ఇసుక డంపు సిజ్ చేయడం జరిగింది*

*నకిలీ విత్తనాల కేసులు*

📌01 కేసు (01) ఒక్కరిపై నమోదు చేయడం జరిగింది. 5000/- రూపాయలు విత్తనాలు సిజ్ చేయడం జరిగింది.

*డిజిల్ దొంగతనం కేసు*

📌02కేసులు 07 మందిపై నమోదు చేయడం జరిగింది. 526945/- రూపాయల విలువగల 5325 లీటర్ల డిజిల్ సిజ్ చేయడం జరిగింది.

*కోడి పందెం కేసులు*

📌01 కేసు 11 మందిపై నమోదు చేయడం జరిగింది.02 పందెం కోళ్ళు ,04 బైక్స్ ,05 సెల్ ఫోన్స్ ,2980/- నగదు సిజ్ చేయడం జరిగింది

Related posts

బెదిరింపు చర్యల కు పాల్పడితే సహించేది లేదు

రాజ్యాంగం లోని కార్మిక చట్టాలను అమలు చేసిన రోజే* *అసలైన కార్మికులకు* *న్యాయం* *జరుగుతుంది*

Share via