తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం
*15వార్డ్ అధ్యక్షుడు ఎండి అమీర్ ఖాన్*
*వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు*
Date 26 /4/2024
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేంసాగర్ రావు ఆదేశాలమేరకు…పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని 15వార్డ్ అధ్యక్షుడు ఎండి అమీర్ ఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం అయన పట్టణంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ, చేతి గుర్తుకు ఓటేయ్యాలని ప్రచారం నిర్వహించారు అనంతరం ఓటు ఎలా వేయాలో ప్రజలకు, ఓటర్లకు అవగాహన కల్పించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని ఓటర్లను కోరారు
ఈ కార్యక్రమంలో 15వార్డ్ అధ్యక్షుడు ఎండి అమీర్ ఖాన్ నయం అంజూమ్ జమీర్ మస్రత రఫీక్ వీఖర్ సాదిక్ నజీర్ షాకీర్ తదితరులు పాల్గొన్నారు