ఆవు పై గొడ్డలితో దాడి చేసిన నిందితుల అరెస్టు. కేసు వివరాలు తెలిపిన రూరల్ సీఐ అఫ్జాలోద్దీన్
తేదీ 23.04.2024 న ఫిర్యాది చల్లురి దయాకర్, మాలగురిజల గ్రామము అవును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు కాళ్ళూ నరికివేసినరని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు లో భాగంగా అనుమనితులుగా ఉన్న నిందితులు 1. దుగుట వెంకటస్వామి తండ్రి:మల్లయ్య వయస్సు:29 సంవత్సరాలు, కులం: నెతకాని వృత్తి: కులీ నివాసం:మాలగురిజల గ్రామము బెల్లంపల్లి మండలము 2. కుమ్మరి కళ్యాణ్ తండ్రి:కిష్టయ్య, వయస్సు:30 సంవత్సరాలు, కులం: నేతకాని వృత్తి:కూలి నివాసం:దుగనేపల్లీ గ్రామం బెల్లంపల్లి మండలం విచారించగ ఇద్దరు గతంలో అవులను ఎద్దులను దొంగతనం చేసి వాటిని చంపి వాటి మాంసం ని గుర్తు తెలియని వ్యక్తులకి అమ్మి డబ్బులు సంపాదించే వారిమని , ఇదే మాదిరిగా తేధి 23.04.24 న ఉదయం అందజ 9.30 గంటల సమయంలో కుమ్మరి కళ్యాణ్ ఇంట్లో నుండి ఒక గొడ్డలి, ఒక కత్తి తీసుకుని స్కూటీ పైన ఇద్దరు కలిసి, ఆకుదారి చంద్రశేకర్ ని బటవానపల్లి జి ప ,దగ్గర స్కూటీ మీద ఎక్కించుకుని ముగ్గురు కలసి రంగపేట గ్రామ శివారు లోని ఉప్పర్ల చెరువు దగ్గరలో ఒంటరిగా గడ్డి మేస్తూన్న ఒక అవు ని చూసి పొదలల్లోకి తీసుకువెళ్ళి పట్టుకోని గొడ్డలితో ఆవు యొక్క నాలుగు కాళ్ళని నరికినారు తర్వాత ఆవు ని చెట్ల పోధల్లో ఉంచేసి ఆవు చచ్చినక రాత్రి వచ్చి దాని మాంసం కోసుకుని అమ్ముకుoదాము అని అనుకోని వెళ్లినమని నేరం ఒప్పుకోవడం జరిగింది.
ఇట్టి నేరస్తుల పైన గతంలో ఇటువంటి నేరాలు పలు పోలీస్ స్టేషన్లలో నమోదు అయినవి. నెరస్థుల వద్ద నుండి ఒక గొడ్డలి, ఒక కత్తి, రెండు కొబ్బరి తాళ్ళు ఒక స్కూటీ ని పంచుల సమక్షంలో జప్తు చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది అని సీఐ తెలిపినారు.
మూగ జంతువులను చంపిన, వాటిపై ఎవరైనా దాడులు చేసి గాయాపరిచిన వారి పైన చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోబడును అని బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జాలోద్దీన్ తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో తాల్లగురిజల ఎస్ఐ నరేష్ మరియు సిబ్బంధి పాల్గొన్నారు.