*మొక్కలు నాటి , పుస్తకాలను కానుకలుగా ఇచ్చి..* (తేదీ 23 4 2024 మంగళవారం పాఠశాల చివరి పనిచేయు దినం )
*ఉద్యోగ జీవితం చివరి పని దినం రోజున మధుర జ్ఞాపకాలు పంచి స్ఫూర్తి నింపిన పారుపల్లి ప్రధానోపాధ్యాయుడు*
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తక్కువ సమయంలో ఎక్కువ విలువైన అందించిన ప్రధానోపాధ్యాయులు గుండేటి యోగేశ్వర్ విద్యార్తులను పాఠశాల వైపు ఆకర్షింప చేయడానికి, ఉత్తమ ఫలితాల సాధనకు వినూత్నమైన శైలిలో ఎంతోగానో కృషి చేసి ఆదర్శంగా నిలిచారు..
ఏప్రిల్ మాసంలో అధికారికంగా ఉద్యోగ విరమణ చెందుతున్న నేపథ్యంలోచివరి పని దినం రోజున పాఠశాల ఆవరణలో హెచ్.ఏం, జిల్లా పర్యావరణ విద్య సమన్వయ అధికారి యోగేశ్వర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత..
ప్రపంచ భూగోళ సంరక్షణ దినం, నేటి ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా.. వినూత్న ఆలోచనతో పాఠశాల ఆవరణలో పచ్చని మొక్కలు వేప,అల్ల నేరేడు,కానుగ, చెట్లు నాటి.. పర్యావరణ స్ఫూర్తిని నింపారు.
విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మనం నాటిన మొక్కలను మనమే రక్షించుకుందాం అంటూ అని ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలకు విలువైన గ్రంథాలను,మంచిర్యాల జిల్లా సమగ్ర సమరూప స్వరూపం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, వ్యాసాలు, కవితలు, ఇతర విలువైన పుస్తకాలను విద్యార్థులకు బహుమతిగా ఇచ్చారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు మిఠాయిలు పంచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి మనకోసం మనం బడి కోసం కలిసి పనిచేసి పిల్లలను పాఠశాలలో అధిక సంఖ్యలో చేర్పించేందుకు విద్యార్థులను పాఠశాల వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేయాలని వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని సర్కారు డుల బలోపేతానికి నిరంతరం కృషి చేయడం ఉపాధ్యాయు లందరి బాధ్యతని సూచించారు.
అందరితో ఆత్మీయంగా ఆనందంగా గడిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి పాఠశాల నుంచి వీడ్కోలు ఘనమైన వీడ్కోలు తీసుకున్నారు.. నలుగురు కన్నీటి పర్యంతమయ్యా రు.. ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను ఉద్యోగ భరితమైన మనసుతో మోసుకొని వెళ్లారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు పొగాకు వెంకటేశ్వర్, టీ పావని,బి. బిక్కు, బి నర్సింగ్, ఏ సతీష్ కుమార్, పి.వాణిశ్రీ, కే.సంతోష్ గ్రీన్ కోర్ పర్యావరణ క్లబ్బు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.