Praja Telangana
తెలంగాణ

మిసెస్ ఇండియా రన్నరప్‌గా నిలిచిన హైదరాబాదీ అందం శృతి చక్రవర్తి..*

*మిసెస్ ఇండియా రన్నరప్‌గా నిలిచిన హైదరాబాదీ అందం శృతి చక్రవర్తి..*

ఇటీవల కాలంలో తెలుగు అమ్మాయిలు అన్ని రంగాల్లో సత్తా చాటుతూ అదరగొడుతున్నారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌కి చెందిన శృతి చక్రవర్తి మిసెస్ ఇండియా రేసులో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఈ నెల 16వ తేదీన రాజస్థాన్‌లోని జైపూర్‌లో మిసెస్ ఇండియా-2024 అందాల పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఇక ఈ పోటీలో శృతి చక్రవర్తి కూడా పాల్గొనగా.. మొత్తం 20 మంది కంటెస్టెంట్స్‌లో శృతి చక్రవర్తి.. మొదటి రన్నరప్‌గా నిలిచి వావ్ అన్నారు. ఫస్ట్ రన్నరప్‌గా టైటిల్ ని అందుకున్న శృతి చక్రవర్తి.. రీసెంట్‌గా హైదరాబాద్‌కు చేరుకోగా.. ఆమెకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శృతి తనదైన గ్లామర్ తో ఈ అందాల పోటీలో అందరిని అలరించింది. భరత్ 24 సమర్పించిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్, గ్లామానంద్ గ్రూప్ సుందరమైన జైపూర్ నగరంలో ఏప్రిల్ 16న నిర్వహించింది. మరో 20 మంది ప్రతిభావంతులైన కంటెస్టెంట్స్‌లో పోటీ పడిన శృతి తన దయ, ప్రశాంతతో పాటు, అందాల ఆకర్షణతో హృదయాలను దోచుకుంది. రన్నరప్ స్థానానికి చేరుకోవడానికి.. ఆమె ముఖ్యంగా తన శిక్షణ, వస్త్రధారణ వంటి సెషన్‌లతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇది ఆమె అంకితభావం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.

సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన శృతి, అందాల పోటీల రంగంలోకి ప్రవేశించింది. ఇలా ఓవైపు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, మరోవైపు గృహిణిగా ఉంటూ.. మరోవైపు అందాల పోటీలో రన్నరప్‌గా నిలిచి వావ్ అనిపించింది. ఇలా అనేక పాత్రల్లో తన బహుముఖ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది.

ఆమె అద్భుతమైన ప్రదర్శన భారతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. తన అందం, గ్రేస్‌తో ఎందరినో ఆకట్టుకుంది. ఆమె ఈ అద్భుతమైన విజయంతో ఇంకా మరిన్నీ విజయాలను అందుకోవాలనీ.. తన అచంచలమైన సంకల్పంతో ఏ కల అయినా చేరుకోగలదని అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు.. ఇంతటి గొప్ప విజయం సాధించిన శృతికి నెటిజన్స్ అభినందనలు చెబుతున్నారు.

Related posts

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

బీసీ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామస్థాయికి తీసుకుపోవాలని వక్తల పిలుపు.

రంజాన్ పర్వదినాన సాయి భోజన్*- రంజాన్ పర్వదినాన సాయి భోజన్*-

Share via