Praja Telangana
తెలంగాణ

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి.* _జహీరాబాద్ పార్లమెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి.*_

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి.*
_జహీరాబాద్ పార్లమెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి.*_

జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల పై సోమవారం తహసిల్దార్ లు మరియు సెక్టోరల్ అధికారులతో సమీక్ష సమావేశం ను మద్నూర్ మండల తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(జుక్కల్ (sc) అసెంబ్లీ సెగ్మెంట్) డి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ గత అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు సజావుగా నిర్వహించి నట్లే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు సజావుగా, ప్రశాంతం గా జరిగే విధంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు సక్రమంగా నిర్వర్తించి ఎన్నికలు సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆయా మండలాల పరిధిలో ఉన్న తహసిల్దార్ లు, సెక్టోరల్ అధికారులు, బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకొని ఒక్కో సెక్టార్ కు ఉన్న పోలింగ్ స్టేషన్ లు, సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణపై ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని వాటికి సన్నద్ధం కావాలని తెలిపారు.
ఈ సమావేశంలో మద్నూర్ తాసిల్దార్ ఎండి మూజిబ్ , బిచ్కుంద తాసిల్దార్ సురేష్, పిట్లం తాసిల్దార్ వేణు, నిజాంసాగర్ తాసిల్దార్ బిక్షపతి, డోంగ్లి తసిల్దార్ రేణుక, పెద్ద కొడప్ గల్ తాసిల్దార్ దశరథం, మొహమ్మద్ నగర్ తహసీల్దార్ క్రాంతి కుమార్ మద్నూర్ నాయబ్ తాసిల్దార్ భరత్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ విజయ్, గిర్ధవార్ శంకర్, మరియు సర్వేయర్ లు , సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీ లోని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాసం లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తో పాటు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రెస్ మీట్.

ఎస్.సి మోర్చ జిల్లా అధ్యక్షులు రమేష్ కు సన్మానం ఎంపి అభ్యర్ధి గెలుపుకు కృషి

Beuro Inchange Telangana: Saleem

నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో సహా ముగ్గురు వ్యక్తులు అరెస్ట్.*

Share via