దేశంలో తీవ్రమవుతున్న వేసవి తాపం
Apr 21, 2024,
దేశంలో తీవ్రమవుతున్న వేసవి తాపం
దేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి తాపం పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేసవి తాపం తీవ్రమైంది. ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడుతున్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్- జూన్ మధ్య ఉష్ణోగ్రతలు పెరగొచ్చని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. 10- 20 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉండొచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో అది 20 రోజుల కన్నా ఎక్కువగా కొనసాగొచ్చని పేర్కొంది.