*తెలంగాణలో పండుగలు ర్యాలీలు శాంతియుతంగా నిర్వహించాలి: సిపి*
హైదరాబాద్:ఏప్రిల్ 21
పండగలు, ర్యాలీలను శాంతియుతంగా నిర్వ హించుకోవాలని హైదరా బాద్ సీపీ కొత్తకోట శ్రీని వాస్రెడ్డి సూచించారు.
త్వరలో రానున్న హను మాన్ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులతో పాటు ఇతర శాఖల అధికారులతో ఈరో జు సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ర్యాలీలో డీజే, ఫైర్ క్రాకర్‌లు పేల్చడం, బాటసారులపై రంగులు చల్లడం, కర్రలు, కత్తులు, ఆయుధాలు తీసుకెళ్లడం, రెచ్చగొట్టే ప్రసంగాలు, పాట లు, బ్యానర్‌లు ప్రదర్శించ డంపై నిషేధం ఉందన్నారు.
పోలీసుల అనుమతి లేకుం డా డ్రోన్‌లను వినియోగించ కూడదన్నారు. ర్యాలీ ప్రశాం తంగా జరిగేలా అందరూ కలిసి సహకరించుకో వాలన్నారు.
ఎన్నికల కోడ్ అమలు లోఉన్నందున ర్యాలీ నిర్వాహ కులు మోడల్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించకూడ దన్నారు.