*జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం*
————
సిరిసిల్ల జిల్లా
————
బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల నాల్గవ సంవత్సరం విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం యొక్క ప్రారంభోత్సవ వేడుకలు ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ లోని రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఏఓ ఎం.సురేష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సేవా పథకంలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి తమవంతు సేవ ఈ గ్రామానికి అందించాలని సూచించారు. కళాశాల అసోసియేట్ డీన్ ఇన్చార్జ్ డాక్టర్.రజియా సుల్తానా మాట్లాడుతూ ఈ ప్రత్యేక శిబిరం ఏడు రోజులపాటు పెద్ద లింగాపూర్ గ్రామంలో నిర్వహిస్తారని, ఇందులో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం, క్యాంపింగ్ లో భాగంగా జిల్లా పరిషత్ పాఠశాల పరిసరాలను విద్యార్థులు శుభ్రం చేసి ప్రజలకు పరిశుభ్రం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ అవగాహన కల్పించారు. ఈ గ్రామీణ సేవా పథకంలో ఎంపీడీవో బి.శ్రీనివాస్ మూర్తి, కరీంనగర్ కోఆర్డినేటర్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, గ్రామ కార్యదర్శి రంజిత్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ టి.అరుణ్ బాబు, కె.భవ్యశ్రీ, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
previous post