Praja Telangana
తెలంగాణ

పోగొట్టుకున్న ఫోన్ ను బాధితునికి అప్పగించిన మందమర్రి ఎస్ఐ*

*పోగొట్టుకున్న ఫోన్ ను బాధితునికి అప్పగించిన మందమర్రి ఎస్ఐ*

పోగొట్టుకున్న ఫోను సి.ఈ.ఐ.ర్ పోర్టల్ ద్వారా గుర్తించి, ఈ రోజు మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ బాధితునికి అప్పగించారు.
వివరాల్లోకి వెళితే ఎంపటి అరవింద్ కుమార్ అనే వ్యక్తి గత సంవత్సరం అక్టోబర్ నెలలో బైక్ మీద వెళుతూ ఉండగా తన యొక్క మొబైల్ ఫోన్ ఎక్కడో పడిపోయింది అని, సీఈఐఆర్ పోర్టల్ ఫిర్యాదు నమోదు చేయగా, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వెతికి పట్టి బాధితుడికి అప్పగించారు. పోయిన తన మొబైల్ ని గుర్తించి అప్పగించినందుకు బాధితుడు పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ ఎవరైనా వారి యొక్క సెల్ ఫోను పోగొట్టుకున్న, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలు *సి. ఇ. ఐ. ర్* పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేసుకోగలరని, ఈ విధంగా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని, 2023 జనవరి 1 వ తేది నుండి ఇప్పటివరకు మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో *61* పోయిన మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.ఈ సందర్భంగా పోయిన మొబైల్ ఫోన్లను వెతికి పట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన మందమర్రి టెక్ టీం కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఎస్ఐ అభినందించారు.

Related posts

చెన్నూరులో రాస్తారోకో చేసిన బీ ఆర్ఎస్ నాయకులు

*మందమర్రిలో 40000/- విలువగల గంజాయి పట్టివేత*

నా గురువర్యులు కే.ఆర్ కు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

Share via