Praja Telangana
తెలంగాణ

ఓపెన్ ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించాలి*

*ఓపెన్ ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించాలి*

*జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్*

మంచిర్యాల:
ఏప్రిల్, 18, 2024:

జిల్లాలో ఈ నెల 25 నుండి మే 2వ తేదీ వరకు జరుగనున్న ఓపెన్ ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పకడ్భందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శైలజ, మున్సిపల్ కమీషనర్ మారుతిప్రసాద్ కలిసి పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల కొరకు 5, 10వ తరగతి కొరకు 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం 9 గం||ల నుండి మధ్యాహ్నం 12 గం||ల వరకు, మధ్యాహ్నం 2.30 గం||ల నుండి 5.30 గం॥ల వరకు కార్యచరణ ప్రకారం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు 1 వేయి 317 మంది, 10వ తరగతి పరీక్షల కొరకు 659 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణ కొరకు అధికారులు, అవసరమైన సిబ్బందిని నియమించడం జరిగిందని, ప్రశ్నాపత్రాలు, జవాబుపత్రాల తరలింపుకు బందోబస్తు ఏర్పాట్లతో పాటు పరీక్షలలో ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిబంధనల మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉ ంచడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్.టి.సి. ద్వారా సమయానుకూలంగా బస్సులు నడిపించడం జరుగుతుందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, మూత్రశాలలు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా సౌకర్యాలు కల్పించడంతో పాటు అత్యవసర సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని, వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఓ. ఆర్.ఎస్. ప్యాకెట్లు, మందులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రంలోనికి మొబైల్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించడం జరుగదని తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, జిల్లా ఖజానా, రెవెన్యూ, వైద్య-ఆరోగ్య, తపాలా, ఆర్.టి.సి., విద్యుత్ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంచిర్యాల పలు గ్రామాలలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

పబ్లిక్ పైప్ బండిల్ ను దొంగరించిన దొంగ అరెస్ట్

తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం..*

Beuro Inchange Telangana: Saleem
Share via