*ఉచిత చేప పిల్లల పంపిణీకి సొసైటీ అకౌంట్లో నగదు జమ చేయాలి
లెల్లెల బాలకృష్ణ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మత్స్య సహకార సంఘాలకు చేప పిల్లల పంపిణీ కోసం 100 కోట్ల రూపాయలు తక్షణమే కేటాయించి ఖర్చు చేయాలని, టెండర్ల ద్వారా బ్రోకర్ల నుండి పంపిణీ కాకుండా నేరుగా మత్స్య సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల. బాలకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు….
ఈరోజు సంఘం ( TMKMKS) ముఖ్యభాద్యుల సమావేశం మంచిర్యాల టౌన్ లోని నీలకంఠేశ్వరరావు హాస్పిటల్ లో బోడెంకి చందు అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన లెల్లెల బాలకృష్ణ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది చపరిశ్రమ అభివృద్ధి మత్స్యకారుల సంక్షేమం పట్ల ఇలాంటి చిత్తశుద్ధి తో సంక్షేమ పథకాలను ప్రకటించడం లేదని కనీసం మత్స్యశాఖకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయకపోవడం ఉన్న మత్స్యశాఖ కమిషనర్ పోస్ట్లు రెగ్యులర్ కమిషనర్ కాకుండా అదనపు కమిషనర్ను కేటాయించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు, తక్షణమే మత్స్య శాఖకు మంత్రిని రెగ్యులర్ కమిషనర్ ఐఏఎస్ క్యాడర్ అధికారిని కేటాయించాలని డిమాండ్ చేశారు,
తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని బడ్జెట్లో నిధులు కేటాయించాలని, ఏడాది తీవ్ర కరువుతో ఇబ్బందుల్లో ఉన్న మత్స్య పరిశ్రమ ఆదుకోవడానికి చెరువుల కుంటల లీజులు రద్దు చేయాలని ఈరోజు జరిగిన సమావేశంలో లెల్లెల బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
మంచిర్యాల జిల్లా కేంద్రంలో 10 ఎకరాల స్థలం కేటాయించి 50 కోట్ల రూపాయలతో హోల్సేల్ చాపల మార్కెట్ నిర్మించాలని ఈరోజు జరిగిన సమావేశం తీర్మానించడం జరిగింది,
ఈ సమావేశానికి మత్స్యకారుల సంఘం జిల్లా నాయకులు గుమ్ముల శ్రీనివాస్, జూనగరి నారాయణ గుమ్ముల ఆశన్న, బోడెంకి మహేష్, సందిరి వెంకటేశ్వర్లు బోడెంకి కుమార్ తదితరులు పాల్గొన్నారు.