Praja Telangana
తెలంగాణ

కాంగ్రెస్కు వస్తున్న ఆదరణను ఓర్వలేక పోతున్నారు’

‘కాంగ్రెస్కు వస్తున్న ఆదరణను ఓర్వలేక పోతున్నారు’
బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ను గెలిపించిన మెజారిటీతోనే పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ శ్రేణులను కోరారు. బెల్లంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. బిజెపి. బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బురద చల్లాలని చూస్తున్నాయని విమర్శించారు. గడ్డం వంశీ మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాను,బెల్లంపల్లి నియోజకవర్గ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రైవేటు సంస్థలను నెలకొల్పేందుకు కృషి చేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రుల సహకారంతో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు

Related posts

కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం హేయమైన చర్య రవీందర్ యాదవ్.*

సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్

తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికిన పెద్దపల్లి ఇంచార్జ్ బండి ప్రభాకర్

Share via