రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం
Apr 11, 2024,
రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా యాక్సిస్ బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారిని మోసగించి రూ.1.92 లక్షలు కాజేశారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపరిచిత లింకులను క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.