కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. బెల్లంపల్లి టౌన్, ఏప్రిల్ 11 సూర్య మేజర్ న్యూస్ బెల్లంపల్లి లోని కాంగ్రెస్ ఆఫీస్ లో ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాతరి స్వామి తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజుల్లో జరగబోవు పార్లమెంటు ఎలక్షన్ ను ఉద్దేశించి రేపు మనం బెల్లంపల్లి నియోజకవర్గం లో జరగబోవు ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాబోతున్న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పార్లమెంట్ ఇన్చార్జి మంత్రి దుదెర్ల శ్రీధర్ బాబు మంచిర్యాల శాసనసభ్యులు ప్రభుత్వం లక్ష్మణ్ చందూరు శాసనసభ్యులు వివేక్ రామగుండం శాసనసభ్యుడు పెద్దపల్లి శాసనసభ్యుడు విజయ రామారావు జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి బెల్లంపల్లి శాసనసభ్యుడు వినోద్ తదితరులు పాల్గొంటారని అన్ని మండలాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని మండలాల ఇన్చార్జులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇదే ఆహ్వాన బాపత్రం లాగా భావించాలని అందరికీ పేరుపేరునా ఇది ఆహ్వానమని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.