*రంజాన్ పర్వదినాన సాయి భోజన్*- . *బెల్లంపల్లి పట్టణంలోని పలుచోట్ల మధ్యాహ్నం అన్నదానం అన్నార్తులు, అనాథలు, యాచకులకు భోజనం పంపిణ ట్రస్టు సేవా కార్యక్రమాల్లో వెల్లివిరుస్తున్న మతసామరస్యం*
, ఏప్రిల్ 11 బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల సహకారంతో గురువారం మధ్యాహ్నం సాయి భోజన్ అన్నదానం పంచినట్లు వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పలు చోట్ల యాచకులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు, పేదవారికి, అన్నార్తులకు మధ్యాహ్నం భోజనం అందజేశారు.
వెల్లివిరిసిన మతసామరస్యం
బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో మతసామరస్యం వెల్లివిరుస్తోంది. “సబ్కా మాలిక్ ఏక్ హై” అన్న నినాదాన్ని అనువణువునా ఆకళింపు చేసుకున్న ఈ ట్రస్ట్ అన్ని వర్గాల అన్నార్తుల, అభాగ్యుల, నిర్భాగ్యుల ఆకలి తీర్చేలా అనునిత్యం కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రపంచ శాంతిని బోధించిన.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకుంటున్న.. రంజాన్ పవిత్ర మాస ముగింపును పురస్కరించుకొని అన్నదానం చేయడం ఆనందంగా ఉందని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పేర్కొన్నారు.
అన్నదానం చేద్దాం
బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం సేవే మార్గంగా, ట్రస్ట్ కొనసాగుతుందని మానవసేవే మాధవసేవ అని త్రవిద్య శ్ర విద్య త్రయాక్షర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ ట్రస్ట్ సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. ట్రస్ట్ మేనేజర్- 8106550532, ట్రస్ట్ ఫౌండర్స్- 9959269975 ,9949041595 ఫోన్ నెంబర్లలో సంప్రదించి అన్నార్తులకు అన్నదానం చేయదలుచుకున్న వారు సేవలో భాగస్వామ్యం కావాలని కోరారు.