అమ్మ ఒడి ఎన్జీవో అన్నదాత ప్రాజెక్టు నాలుగో వార్షికోత్సవ వేడుకలు
తేదీ 10 4 2024 బుధవారం రోజున బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక సింగరేణి కళావేదికలో అమ్మఒడి ఎన్జీవో అన్నదాత ప్రాజెక్ట్ నాలుగవ వార్షికోత్సవం వేడుకలు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమాన్ల మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి ఏసీపి రవికుమార్ అమ్మఒడి ఎన్జీవో వ్యవస్థాపకులు అజ్మీర మోహన్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ముక్క రమేష్ హాజరయ్యారు. అమ్మ ఒడి వార్షికోత్సవం సందర్భంగా అమ్మ ఒడి సహాయకులను సభ్యులను ఘనంగా సన్మానించి అలాగే రాంజీ గౌడ్ విద్యార్థులకు విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు నిరంతరాయంగా కొనసాగుతూ ఇప్పటికీ 246 వారాలు పూర్తి చేసుకోవడం హర్షించదగ్గ విషయమని ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం గొప్ప మానవతా స్ఫూర్తి అని ఏదైనా అవసరమైనప్పుడు తన వంతు సహాయంగా అమ్మ ఒడికి సహాయం అందిస్తానని రవికుమార్ పేర్కొన్నారు. అమ్మ ఒడి ఎన్జీవో వ్యవస్థాపకులు అజ్మీర మోహన్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో లాక్ డౌన్ సమయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా ఇన్ని వారాలు పూర్తి చేసుకున్నదంటే హనుమండ్ల మధు తపన మరియు సభ్యుల సహకారం దాతల సహకారంతోనే సాధ్యమైంది అన్నారు ఇంకా ముందుకు కొనసాగుతుందని పేర్కొన్నారు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ముక్క రమేష్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్న సూక్తి అమ్మఒడి ఎన్జీవో అన్నదాత ప్రాజెక్టు అర్థవంతం చేసిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో అమ్మఒడి సభ్యుల కుటుంబ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు