*మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు సిద్ధం… ఆదివారం పరీక్షల నిర్వహణ*( కోటపల్లి మండల కేంద్రం తేదీ 6 ఏప్రిల్ 2024, శనివారం)
జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు కోటపల్లి మండలం కేంద్రంలోనీ తెలంగాణ మోడల్ హై స్కూల్ లోని పరీక్ష కేంద్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్ష కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ సూపర్డెంట్ తుమ్మల లక్ష్మారెడ్డి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గుండేటి యోగేశ్వర్ తెలిపారు. ఉదయం 10 గం.లకు ఆరో తరగతి మరియు మధ్యాహ్నం 2గం.లకు 7,8 ,9, 10 తరగతి వారికి పరీక్ష నిర్వహించబడును.
అభ్యర్థులు నిర్ణీత సమయానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రం చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు. పరీక్ష కేంద్రంలో వైద్య సహాయం త్రాగునీటి వసతి పోలీస్ నిగా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందని ఉంటుందని తెలిపారు.