*బాబు జగ్జీవన్ రామ్ స్మరణలో సాయి భోజన్*
– యాచకులు, పేదలు, అన్నార్తులకు వికలాంగులు వృద్ధులకు ఆహార పంపిణీ
– బెల్లంపల్లి పట్టణంలోని పలుచోట్ల కార్యక్రమం
– బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ
*తెలంగాణ-మంచిర్యాల జిల్లా-బెల్లంపల్లి*
*బెల్లంపల్లి:* భారత మాజీ ఉప ప్రధాని సంఘసంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు దేశం గర్వించదగ్గ నేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బెల్లంపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల సహకారంతో అన్నార్తులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని రైల్వే స్టేషన్, కాల్ టెక్స్, బజార్ ఏరియా, కాంటా చౌరస్తా తదితర ప్రాంతాలలో ఆహార పంపిణీ చేపట్టగా యాచకులు, వికలాంగులు, అన్నార్తులు, వృద్ధులు, తదితరులు సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
*మహానేతను గుర్తు చేసుకుంటూ..*
భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతగానో కృషిచేసి, స్వతంత్ర భారతావనిలో రాజకీయంగా వివిధ పదవుల్ని పోషించి, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ కు దక్కుతుందని భాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ముఖ్యంగా అంటరానితనం నిర్మూలన కోసం ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. మనుషులంతా సమానమే అనే ఆయన భావన తమ ట్రస్టు భావజాలంతో సరితూగుతుందని గుర్తు చేసుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తి స్మరణలో అన్నదానం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
*అన్నదానం చేద్దాం*
ట్రస్ట్ ద్వారా “ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం” అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని,మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ గార్లు తెలిపారు ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సేవకులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.