మాదిగలను రాజకీయంగా భూస్థాపితం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం మాలలకు వత్తాసు పాడుతున్న రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పార్లమెంట్ సీటు కేటాయించక పోవడానికి నిరసన ఉరివేసుకొని రాస్తా రోకో చేసిన ఎంఅర్పియస్ నాయకులు
ఈ సదర్భంగా ఎంఆర్పియస్ జిల్లా అధ్యక్షులు
చెన్నూరి సమ్మయ్య మాదిగ మాట్లాడుతూ
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి మాదిగలే కారణం అని అనేక సందర్భాలలో చెప్పిన రేవంత్ రెడ్డి తీర ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక దాన్ని కాపాడటం కోసం మాలాలకు సలెండర్ అయ్యి మాదిగలను రాజకీయంగా ఉరి వేయడం జరిగింది
వర్గీకరణను అడ్డుకుంటున్న మాల కులానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ కర్గే మాటలు వింటు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలలో ఒక్క సీటు కూడ మాదిగలకు కేటాయించికుండ మోసం చేస్తుంది
ఉసరవెల్లిల పార్టీలు మారుస్తున్న వారికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్లు కేటాయించింది అందులో అందులో పెద్దపల్లి పార్లమెంట్ సీటు వివేక్ కొడుకు వంశీకి వరంగల్ పార్లమెంట్ సీటు కడియం కూతురు కావ్య కి కేటాయించింది ఇక పోతే నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి కి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు తెర లేపింది
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకి కాంగ్రెస్ పార్టీ తక్షణమే రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలి లేని పక్షంలో మాదిగలందరు కాంగ్రెస్ పార్టీనీ వీడి సమాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ వైపు నిలబడాలి
కాంగ్రెస్ పార్టీ మాదిగలను మాసం చేయాలని చూస్తే కేసిఆర్ కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు
మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలకు అన్యాయం చేస్తే పోరాటాలు చేసి మాదిగ జాతికి అండగ నిలబడుతాం అని తెలిపారు
ఈ కార్యక్రమంలో
ఎంఆర్పియస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగ, ఎంఆర్పియస్ పట్టణ ఇంఛార్జి చిప్పకుర్తి మల్లేష్ మాదిగ, ఎంఆర్పియస్ మందమర్రి మండల ఇంఛార్జి జీడి సారాంగం మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా ఇంఛార్జి చిప్పకుర్తి సతీష్ మాదిగ, మండల అధ్యక్షులు కుషనపల్లి రాజలింగు మాదిగ, ఎల్కటూరి రాజేష్ మాదిగ, రామగిరి రామ్ మాదిగ, అసంపల్లి శివకుమార్ మాదిగ, ఎంఆర్పియస్, ఎంఎస్పి నాయకులు గోగర్ల శేఖర్ మాదిగ, గాలిప్లలి సత్యనారాయణ మాదిగ, చిలుముల రాజుకుమార్ మాదిగ, మాడుగుల రాజుకుమార్ మాదిగ, జిల్లపల్లి కిరణ్ మాదిగ, కాంపల్లి కుమార్ మాదిగ, అసంపల్లి రంష్ కుమార్ మాదిగ, పులిపాక శాందాస్ మాదిగ, కల్వాల తిరుపతి మాదిగ