@ ఎస్.సి మోర్చ జిల్లా అధ్యక్షులు రమేష్ కు సన్మానం
@ ఎంపి అభ్యర్ధి గెలుపుకు కృషి
భారతీయ జనతా పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు కోడి రమేష్ బిజెపి ఎస్ సి మోర్చ మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆయనను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, బిజెపి నాయకులు ఈ రోజు బెల్లంపల్లి లోని బిజెపి కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ రోజు బెల్లంపల్లి లోని బిజెపి కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి మాట్లాడుతూ కోడి రమేష్ ఎస్ సి మోర్చ జిల్లా అధ్యక్షులు గా పదోన్నతి పొందడం హర్షదాయకం అన్నారు. జిల్లాలో దళితుల్ని బిజెపిలో చేర్పించి పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయాలనీ కోరారు.
@ ఎంపి అభ్యర్ధి గెలుపుకు కృషి
భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గా పోటీ చేస్తున్న గోమాస శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేశవ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గోవర్దన్, ఎస్సి మోర్చ జిల్లా అధ్యక్షులు కోడి రమేష్, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాజు లాల్ యాదవ్, సీనియర్ నాయకులు అజ్మీరా శ్రీనివాస్, దూది ప్రకాష్, శ్రావణ్ కుమార్, కోడి సురేష్, ముడిమాడుగుల శ్రీనివాస్, దీపా రాణి, మోహన్, మహేష్, రాములు, మల్లేష్, ప్రభాకర్, కమల్ లహోటి, రాంచందర్, అజ్మీరా సుభాష్ తదితరులు పాల్గొన్నారు.