*నేడు కాంగ్రెస్ గూటికి మేయర్ విజయలక్ష్మి*
హైదరాబాద్:మార్చి 30
గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రె స్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతుంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేని కాంగ్రెస్ పార్టీ 2025లో వచ్చే మున్సిపల్ ఎన్నికల కల్లా నగరాన్ని ‘హస్త’గతం చేసుకునేం దుకు, సిటీలో కాంగ్రెస్ పార్టీని ఓ తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం.
ఇందుకు గాను ఇటీవలే బీఆర్ఎస్‌ను వీడిన సీని యర్ నాయకుడు కే.కేశవ రావును చక్కటి ఆయుధం గా వినియోగిస్తుందన్న వాద నలున్నాయి.
కేశవరావు కుమార్తె, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివా రం ఉదయం తొమ్మిది న్నర గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
మేయర్ బాటలోనే మరో పది మంది కార్పొరేటర్లు న్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది కార్పొరేటర్లు కష్టమొచ్చో, పార్టీ పనుండో కేసీఆర్, కేటీఆర్‌లను కలి సేందుకు ప్రయత్నించినా, వారు పట్టించుకోని వారే ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం.
జీహెచ్ఎంసీ పాలకమండ లికి బాస్‌గా వ్యవహరించే మేయర్ కాంగ్రెస్‌లో చేరితే, తామెందుకు ఇంకా బీఆర్ ఎస్‌లో కొనసాగాలి? అంటూ ఆమెతో క్లోజ్‌గా ఉన్న పలువురు కార్పొరే టర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికారంలో ఉన్నా, అధి కారం కోల్పోయిన తర్వాత కూడా తమ లాంటి చిన్న స్థాయి ప్రజాప్రతినిధులను కలిసేందుకు కూడా ఇష్ట పడని నేతలున్న ఆ పార్టీలో కొనసాగితే మున్ముందు ఎలాంటి గుర్తింపు రాదని కూడా కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వ్యాఖ్యాని స్తున్నట్లు సమాచారం