*రేపు 3 జిల్లాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటన*
హైదరాబాద్:మార్చి 30
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ రేపు పలు జిల్లాల్లో పర్యటించను న్నారు.
నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీ లించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశ మవుతారు.
జనగాం , సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఆయన పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడు తున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
అంతకు ముందు మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పొలాల పరిస్థితిని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు రాష్ట్రంలో చూస్తున్న నీటి కొరతకు ప్రకృతి కారణం కాదని, పాలక పక్షమే కారణమని మండిపడ్డారు.