*అవని హాస్పిటల్ లో అరుదైన వైద్యం*
*తక్కువ బరువుతో పుట్టిన శిశువులు జీవించే అవకాశాలు ఉండవన్న అపోహలు వీడాలి*
*శిశువు మరియు పిల్లల వైద్య నిపుణులు డా,, రుద్రబట్ల రఘువంశీ*
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల అవని హాస్పిటల్ లో
అతి తక్కువ బరువుతో జన్మించిన నవ జాత శిశువులకు అరుదైన చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టాడు మంచిర్యాల కు చెందిన అవని పిల్లల హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ రఘువంశీ.శుక్రవారం మంచిర్యాల పట్టణం లోని అవని హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశం లో మాట్లాడుతూ.. అతి తక్కువ బరువుతో పుట్టిన శిశువులు జీవించే అవకాశాలు ఉండవన్న అపోహలు వీడాలని తెలిపారు. కాగజ్ నగర్ కు చెందిన దీపిక, చెన్నూర్ కి చెందిన మానస వేరే ప్రాంతాల్లో డెలివరి అయ్యారని.నెలలు నిండక ముందే కాన్పు కావడం తో పుట్టిన శిశువులు ఒకరు 575 గ్రా, మరొకరు 800 గ్రామ్ లలో జన్మించారని ,ఒకరిని 40 రోజులు మరొకరిని 30 రోజులు అవని హాస్పిటల్ లోని ఇంటెన్సివ్ కేర్ విభాగం లో ఉంచి అధునాతన చికిత్స అందించామని ,పిల్లల ఎదుగుదల సంబందించి మళ్ళీ ఎటువంటి సమస్య రాకుండా పిల్లలు ఎదిగేలా ట్రీట్మెంట్ చేసినట్లు తెలిపారు.చికిత్స అనంతరం 575 గ్రాములు ఉన్న శిశువు 1.5 కేజి బరువు , 800 గ్రాములు ఉన్న శిశువు 1.3 కిలోల బరువు పెరిగినట్లు తెలిపారు.తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు మాకు దక్కరేమో అనుకోని బాధపడే సమయం లో డాక్టర్ రఘవంశీ పిల్లలకు అందించిన చికిత్స తో వారు కావాల్సిన బరువు పెరగి ఆరోగ్యం గా ఉండడం తో ఇరు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.శిశువుల డిశ్చార్జ్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపి శిశువులను డిశ్చార్జ్ చేస్తున్నట్లు డా రఘువంశి తెలిపారు.గతం లోనూ తక్కువ బరువు తో పుట్టిన పిల్లలకు చికిస్థ అందించినట్లు, దూర ప్రాంతాలకు వెళ్లి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించలేని వారు మంచిర్యాల లోని అవని హాస్పిటల్ లో అతి తక్కువ ధరలకు అందించే వైద్య సదుపాయాలు వినియోగించుకోవాలి అని కోరారు.