భక్తిశ్రద్ధలతో కార్మెల్ చర్చిలో గుడ్ ఫ్రైడే
మందమర్రి మార్చి 29
మందమర్రి పట్టణంలో రోమన్ క్యాథలిక్ కార్మెల్ చర్చిలొ ఫాదర్ జిజ్జో ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు చర్చికి వెళ్లి ప్రార్థనలతో భక్తిశ్రద్ధలతో 40 రోజుల పాటు లెంట్ డేస్ శ్రమ దినాలుగా ఉపవాసం ఉంటూ ఏసుక్రీస్తుని ఆరాధిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు, ఈ సందర్భంగా ఫాదర్స్ జీజో, రెక్స్, జీన్సన్ రెక్టార్, దేవుని వాక్యాన్ని ధ్యానించారు ఏసుక్రీస్తు పొందిన శ్రమలను గురించి తెలియజేస్తూ తమ కోసం చేసిన త్యాగం సిలువపై యేసు పలికిన ఏడు మాటలను వాక్యానుసారంగా వారు తెలియజేశారు. అనంతరం ఏసుక్రీస్తు వేషధారణలో సిలువను మోస్తూ గుడ్ ఫ్రైడే ఘట్టాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ జిజో, కార్మెల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర రెక్స్, ఫాదర్ జీన్సన్ రెక్టర్, సిస్టర్స్, బ్రదర్ సంఘస్తులు పాల్గొన్నారు.