Praja Telangana
తెలంగాణ

గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్ట్..*

*గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్ట్..*

*వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్*

గొల్లపల్లి :

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు.గురువారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియాకి వివరాలను డిఎస్పీ రఘు చందర్ వెల్లడించారు.డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం గంగాధర మండలం కొండయ్య పల్లి గ్రామానికి చెందిన ఇడుగునూరి వంశీ కృష్ణ మరొక మైనర్ యువకుడి ద్విచక్ర వాహనం మీద గంజాయి తరలిస్తుండగా మండల కేంద్రంలోని నంది చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బందిని చూసి పారిపోతుండగా పట్టుకుని విచారించారు. యువకుల నుంచి ఒక బ్యాగ్ లభించగా బ్యాగ్ లో 900 గ్రాముల గంజాయి లభించగా యువకులను పోలీస్ స్టేషన్ కి తరలించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.
యువకులు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి గంజాయిని కొనుగోలు చేసి గంగాధర, పెగడపల్లి మండలాలలో అవసరమైన వ్యక్తులకు,యువకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు.యువకుల నుండి ఒక బైక్,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.గంజాయి తరలిస్తున్న యువకులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి సీఐ రవి,ఎస్సై రామకృష్ణ,పోలీస్ సిబ్బంది సత్తయ్య,వెంకట్ రెడ్డి,ఎల్లయ్యలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.

Related posts

ఈ రోజు హైద్రాబాద్ లో *సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు,ప్రస్తుత రాష్ట్ర టీ,పి,సి,సి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారిని* మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. *అనంతరం బీసీ కులస్థుల సమస్యలకోసం చర్చించడం జరిగింది* *వెంకట్ యాదవ్ యూత్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి*

ఆర్ కె పి పరిదిలోని సింగరేణి కార్మికులకు మున్సిపాలిటీ హెచ్ ఆర్ ఏ చెల్లించాలి.

అవని హాస్పిటల్ లో అరుదైన వైద్యం* *తక్కువ బరువుతో పుట్టిన శిశువులు జీవించే అవకాశాలు ఉండవన్న అపోహలు వీడాలి*

Share via