*ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి*
*సిఐటియు జిల్లా మాజీ అధ్యక్షులు అతిమేల మానిక్*
*ఖేడ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ముందు కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా*
,నారాయణఖేడ్* :
నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 5నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా మాజీ అధ్యక్షులు అతిమేల మానిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖేడ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేశారు.ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ గత ఐదు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్మికుల కుటుంబాలు గడువని పరిస్థితి నెలకొన్నదని, పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇతర పర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతినెల రెగ్యులర్ గా జీతాలు చెల్లించాలని అన్నారు. పెరిగిన ధరలతో వస్తున్న జీతాలు ఏమాత్రం సరిపోతా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.కనీస వేతన అమలు చేయాలని అన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26000/- పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటలక్ష్మి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు చేయడం నాయకులు సతీష్ ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్ హాస్పిటల్ యూనియన్ నాయకులు అడివమ్మ రేవతి లక్ష్మి బాలమణి ఎలీషా బాలనమమమ విక్టోరియా కవిత బాలన్న సత్యనారాయణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు