మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి గుర్రాల శ్రీధర్
అట్ట హాసంగా అంజనీపుత్ర సంస్ధ ఛైర్మన్ శ్రీధర్ జన్మదిన వేడుకలు
అంజనీ పుత్రసంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్ పుట్టిన రోజు వేడుకలను జిల్లా కేంద్రంలో గురువారం అట్టహాసంగా నిర్వహించారు. అంజనీ పుత్ర సంస్థ ఎండీ పిల్లి రవి నేతృత్వంలో 3వేల మందితో రక్త దానం నిర్వహించారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆలయాల్లో ప్రత్యెక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రొచ్చరణల మధ్య శ్రీధర్ ను ఆశీర్వదించారు. ఈ సంధర్బంగా ముఖ్య అతిథిలుగా పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ చైర్మెన్ ఉప్పలయ్య, పలువురు వక్తలు మాట్లాడుతూ స్వయం కృషీ, మంచి వ్యక్తిత్వం కలిగి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా నమ్మకమైన సేవలందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చు కోవడం సంతోష దాయకమన్నారు. సమున్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ అందరికీ స్ఫూర్తి గా నిలుస్తున్న ఆయన సేవలు సమాజానికి ఎంతో ఉపయోగ కరణమన్నారు. ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటవ్ డైరెక్టర్ లు సంతోష్, కిషన్, అభిమానులు, కస్టమర్ లు తదితరులు పాల్గొన్నారు.