Praja Telangana
తెలంగాణ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా. మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదయ్యాయి. మంగళవారం తలమడుగు, జైనథ్‌ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవగా. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదయింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ చెబుతోంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీచేసింది. ఆరుబయట పనిచేసే వారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

హీరో సుమన్ చేతుల మీదుగా హెల్మెట్లు పంపిణీ చేసిన పొట్టల నాగరాజు

రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యం…!

Beuro Inchange Telangana: Saleem

బీఎస్ పి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన, బిఎస్ పి ఇన్చార్జ్ జాడి నరసయ్య

Share via