*బెల్లంపల్లి పట్టణ
ఎన్నికల ప్రచారంలో పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి
గోమాస శ్రీనివాస్*
బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ తో కలిసి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ప్రతి షాపుకు వెళ్ళి వ్యాపారస్తులను మరియు ప్రజలను కలిసి పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించాలని కోరరూ అనంతరం బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అని మరియు పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేసింది అని రఘునాథ్ అన్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిస్తే మోదీ నాయకత్వంలో ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.కుటుంబ పాలన అంతం కావాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించితే మంచిర్యాల జిల్లాలో మరొక కుటుంబం పాలించడానికి చూస్తుందని మంచిర్యాల జిల్లా నుండి కుటుంబ పాలనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకట కృష్ణ, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, జిల్లా కార్యదర్శి మాసు రజిని,బెల్లంపల్లి పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దార కళ్యాణి, ఉపాధ్యక్షురాలు సల్లం సుమలత మరియు బిజెపి కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది