Praja Telangana
తెలంగాణ

ప్లాస్టిక్ అమ్మితే కఠిన చర్యలు

ప్లాస్టిక్ అమ్మితే కఠిన చర్యలు

మున్సిపల్ కమీషనర్ కల్లెడ రాజశేఖర్

వ్యాపారస్థులకు అవాగాహన సమావేశం

, లక్షెట్టిపేట: ప్లాస్టిక్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమీషనర్ కల్లెడ రాజశేఖర్ వ్యాపారస్థులను హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని వర్తక, వాణిజ్య, వ్యాపారస్తులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పట్టణములో ప్లాస్టిక్ వాడకం నిషేధించడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ వాడినట్లయితే జరిమానాతో పాటు, నూతన మున్సిపల్ చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా లక్షేట్టిపేటను తీర్చి దిద్దుదామన్నారు. ప్లాస్టిక్ వాడకం వలన చాలా అనర్థాలు జరుగుతాయాన్నారు. ఈ సమావేశములో శానిటేషన్ ఇన్స్పెక్టర్ అజీమ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కట్ల రాకేష్, వ్యాపారస్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బూత్ కమిటీ సమావేశం

బీఎస్ పి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన, బిఎస్ పి ఇన్చార్జ్ జాడి నరసయ్య

మాదిగలను రాజకీయంగా భూస్థాపితం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ

Share via