Praja Telangana
తెలంగాణ

పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలి – మంథని ఆర్.డి.ఓ. హనుమా నాయక్*

*పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలి – మంథని ఆర్.డి.ఓ. హనుమా నాయక్*
సమావేశం లో పాల్గొన్న ఎసిపి, గోదావరిఖని, ఎసిపి, రామగుండం, డి.ఎస్.పి కాటారం, నియోజక వర్గ స్థాయి ఎలక్షన్ టీంలు, సెక్టార్ అధికారులు, మాడల్ కోడ్ అధికారులు, తహసిల్దార్లు, వివిధ నోడల్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్.హెచ్.ఓ లు మరియు రాజకీయ పార్టీలు
బుధవారం, మంథని
రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై మంథని ఆర్డిఓ హనుమా నాయక్ మంథని, బుధవారం రామగిరి లోని జే.ఎన్.టి.యు.హెచ్, యూనివర్సిటి కళాశాల, మంథని యందు ఎసిపి, గోదావరిఖని, ఎసిపి, రామగుండం, డి.ఎస్.పి కాటారం, నియోజక వర్గ స్థాయి ఎలక్షన్ టీంలు, సెక్టార్ అధికారులు, మాడల్ కోడ్ అధికారులు, తహసిల్దార్లు, వివిధ నోడల్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్.హెచ్.ఓ లతో మరియు రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కమీషన్ ఇండియా ద్వారా లోక్ సభ ఎన్నికలు, 2024 షెడ్యుల్ జారీ చేయడం జరిగిందని, షెడ్యుల్ క్రమము తేది. 18.04.2024 నుండి 25.04.2024 వరకు రిటర్నింగ్ అధికారి, 02-పెద్దపల్లి (ఎస్.సి.) పార్లమెంటరి నియోజకవర్గము & కలెక్టర్ కార్యాలయము, పెద్దపల్లి యందు నామినేషన్లు స్వీకరించబడునని తెలిపారు మరియు రాష్ట్రం అంతట తేది. 13.05.2024 నాడు లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ తదుపరి తేది. 04.06.2024 నాడు కౌంటింగ్ నిర్వహించబడుతుందని తెలిపారు.
ఈ సందర్చంగా, ఆర్.డి.ఓ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి, మంథని నియోజకవర్గం లో ఎలక్షన్ ఖర్చుల వివరాలను పర్యవేక్షించడానికి, జిల్లా ఎన్నికల అధికారి, పెద్దపల్లి ద్వారా, (3) ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం లను, చెక్ పోస్టుల వద్ద 24 గంటలు పర్యవేక్షించే విధంగా (3) స్టాటిక్ సర్వీలన్స్ టీం లను, వీడియో వీవింగ్ టీం, వీడియో సర్విలన్స్ టీం, ప్రతీ మండలానికి ఒక మాడల్ కోడ్ అఫ్ కండక్ట్ ఆఫీసర్ ను మరియు పోలింగ్ స్టేషన్ ల యొక్క పర్యవేక్షనకై (37) సెక్టార్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని తెలిపారు.
లోక్ సభ ఎన్నికల నిర్వహణ లో బాగంగా, మంథని నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయమై మరియు సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల యందు షిఫ్ట్ ల వారిగా పోలీసు సిబ్బంది హాజరు మరియు తనిఖీ విషయమై ఎసిపి, గోదావరిఖని, ఎసిపి, రామగుండం, డి.ఎస్.పి కాటారం వారితో చర్చించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి దృష్ట్యా, సభలు, సమావేశాలు, ర్యాలీలకై రాజకీయ పార్టీలు ముందస్తుగా తమ ద్వారా అనుమతి తీసుకోవాలని, కనీసం (2) రోజుల ముందుగానే ఆన్లైన్ ద్వారా సువిధా పోర్టల్ లో దరఖాస్తు సమర్పించాలని కోరారు.
లోక్ సభ ఎన్నికల నిర్వహణ లో బాగంగా, ప్రతీ తహసిల్దారు మరియు సెక్టార్ ఆఫీసర్ తమ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్ లను తనిఖీ చేయాలని మరియు ప్రతీ బి.ఎల్.ఓ ద్వారా ఓటరు లిస్టు లో అర్హులైన ప్రతీ పౌరుడు ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలని, ప్రతీ బి.ఎల్.ఓ. ద్వారా అర్హులైన 85+ వయసు గల ఓటర్లకు, పి.డబ్లు.డి. ఓటర్లకు ఫారం – 12డి లను నిభందనల మేరకు అందజేయాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా, ఆర్డిఓ గారు మాట్లాడుతూ, తేది. 08.02.2024 నాటికి తుది ఓటర్ల జాబితా క్రమము మంథని నియోజకవర్గములో మొత్తం ఓటర్లు (2,39,108) ఉండగా, ఇందులో మహిళలు :1,21,820, పురుషులు :1,17,271, ట్రాన్స్ జెండర్ : 17 మంది ఓటర్లు గా నమోదు అయినట్లు గా తెలిపారు. అంతేకాకుండా, జిల్లా కలెక్టరు, పెద్దపల్లి ఆదేశాల క్రమము నియోజక వర్గములోని పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల కొరకై ఎలక్షన్ కమీషన్ ద్వారా సూచించ బడిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉండే విధంగా, ప్రతీ తహసిల్దారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా, మంథని నియోజకవర్గం లోని అన్నిపోలింగ్ కేంద్రాలకు బూత్ లెవెల్ ఏజెంట్లను ఒక్కొక్క బూత్ కు ఒక ఏజెంట్ ను పార్టీ నుండి నియమించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఎసిపి, గోదావరిఖని, ఎసిపి, రామగుండం, డి.ఎస్.పి కాటారం, నియోజక వర్గ స్థాయి ఎలక్షన్ టీంలు, సెక్టార్ అధికారులు, మాడల్ కోడ్ అధికారులు, తహసిల్దార్లు, వివిధ నోడల్ అధికారులు, మీడియా నోడల్ అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్.హెచ్.ఓ లు మరియు వివిధ రాజకీయ పార్టీల మరియు (10) మండలాలకు సంబంధించిన తాసిల్దార్లు, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఎస్.సి మోర్చ జిల్లా అధ్యక్షులు రమేష్ కు సన్మానం ఎంపి అభ్యర్ధి గెలుపుకు కృషి

Beuro Inchange Telangana: Saleem

నిషేధిత గుడుంబా(నాటు సారా) విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు*

Beuro Inchange Telangana: Saleem

స్ట్రక్చరల్ సమావేశాలు నిర్వహించి సొంతింటి కల, ఐటీ మాఫీ నెరవేర్చాలి

Share via