Praja Telangana
తెలంగాణ

కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ఎసిపి రవికుమార్

కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ఎసిపి రవికుమార్

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి.

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలి

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్
రామగుండం పోలీస్ కమిషనర్, ఎం శ్రీనివాసులు, ఐజి, ఉత్తర్వుల మేరకు, మంచిర్యాల జిల్లా డిసిపి శ్రీ అశోక్, డిసిపి ఆదేశాల మేరకు, బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసిపి రవికుమార్ ఆధ్వర్యంలో, మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం రాబోయే లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ప్రజలందరూ తమ ఓటు హక్కుని నిర్భయంగా సద్వినియోగం చేసుకునే విధంగా మందమర్రి పట్టణంలో మందమర్రి సర్కిల్ పోలీస్ సిబ్బంది మరియు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసిపి మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు పోలీసు వారి నియమ నిబంధన సూచనలు పాటిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు, తమ ఓటు హక్కు ను వినియోగించుకుని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, సర్కిల్ ఎస్సైలు రాజశేఖర్, ఆంజనేయులు, ప్రవీణ్ కుమార్ లతో , పాటు 100 మంది కేంద్ర బలగాలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

చెన్నూరులో రాస్తారోకో చేసిన బీ ఆర్ఎస్ నాయకులు

ఆర్కే 6 వర్క్ షాప్ ఏరియాలో ప్రచారం నిర్వహించిన కొప్పుల ఈశ్వర్

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్

Share via