Praja Telangana
తెలంగాణ

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి.

హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్.

సైదాపూర్(విశాల భారతి)మార్చి 23:- మండలం లో పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర బలగాలు, స్థానిక బలగాలతో కలిసి కలిసి కవాతు నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ మహంతి ఉత్తర్వుల మేరకు, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రూరల్ సీఐ మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఓటు హక్కుని నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. బొమ్మకల్ బస్టాండ్ నుండి ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ సాగింది. ఈ కార్యక్రమంలో సైదాపూర్ ఎస్సై జన్ను ఆరోగ్యం,హెడ్ కానిస్టేబుల్ కొమురయ్య పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రమించే శ్రామికుల సేవ చేయడమే తన అభిమతం

నేడు కాంగ్రెస్ గూటికి మేయర్ విజయలక్ష్మి*

కార్మికుల సమస్యల పరిష్కరించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుంది. HMS రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్

Share via